Talliki Vandanam : ఖాతాల్లోకి రూ.15వేలు.. తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్..!
వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం.

Talliki Vandanam : తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ స్కీమ్ కింద స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున సాయం అందించనుంది ప్రభుత్వం. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు సర్కార్ ఎగ్గొట్టిందని పదే పదే జగన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తోంది.
ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే అంతమందికి..
ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి తల్లికి వందనం పథకం ఒకటని చెప్పొచ్చు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వకపోవడంపై జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం జూన్ మొదట్లోనే తల్లి వందనం స్కీమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే అంతమందికి ఈ స్కీమ్ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వాగ్దానం ఇచ్చారు.
Also Read : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!
ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలి..
క్యాబినెట్ భేటీ తర్వాత కాసేపు మంత్రులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించాలన్నారు సీఎం చంద్రబాబు. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై చర్చించారు.
ఏప్రిల్ లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సూచన..
ఇక ఏప్రిల్ లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేంద్రం ఇచ్చే 6వేలకు రాష్ట్రం 14వేలు కలిపి ఇచ్చే అంశంపై ఫోకస్ పెట్టారు. కేంద్రంతో పాటు మూడు విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలనే యోచనలో ఉంది. మద్యం దుకాణాలకు వచ్చే కమిషన్ 10.5 శాతం నుంచి 14 శాతానికి పెంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..
మద్యం దుకాణాలకు సంబంధించి ఇది కీలక నిర్ణయంగా చెప్పొచ్చు. ప్రస్తుతం వారికి 10.5 కమిషన్ ఇస్తున్నారు. దాన్ని 14శాతంకు పెంచాలని క్యాబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా ఎకరానికి 8 లక్షలు చెల్లించేందుకు క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు. టీటీడీలో పని చేస్తున్న వర్కర్లను సూపర్ వైజర్లుగా అప్ గ్రేడ్ చేస్తూ మంత్రివర్గంలో చర్చ జరిగింది. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు పదోన్నతి కల్పించేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.