Gossip Garage: రసవత్తరంగా రాయచోటి వైసీపీ పాలిటిక్స్.. గడికోట శ్రీకాంత్‌రెడ్డిని కాదని మరొకరికి టికెట్ ఇస్తారా?
వైసీపీ గడప తొక్కిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల ముందు సైడ్ ట్రాక్ మార్చిన రమేష్ రెడ్డిల పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి.

Gossip Garage: అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఇప్పటికే పార్టీ అధికారంలో లేకున్నా నేతలు తమలో తామే కొట్టుకుంటుంటే..నాకో ఛైర్ అంటూ మరో నేత వచ్చి వాలిపోయారు. రాయచోటి రాజకీయాల్లో కీలక నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడు. జగన్ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన నాటి నుంచి ఆయన వెంట నడుస్తున్నారు.
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీటు నిరాకరించడంతో సైకిల్ దిగి వైసీపీలో చేరారు రెడ్డప్పగారి రమేష్ రెడ్డి. ఆయన చేరికతో వైసీపీకి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నది లోకల్ టాక్. ఇద్దరూ సీనియర్ లీడర్లు కావడంతో అప్పట్లో రమేష్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు జగన్.
రాయచోటి సీటుపై కన్నేసిన ధనుంజయ రెడ్డి..?
ఇకపోతే జగన్‌కు అత్యంత సన్నిహితుడు..గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలకంగా పని చేసిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కూడా రాయచోటి సీటుపై కన్నేశారన్న టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించారన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో రాయచోటి టికెట్ శ్రీకాంత్ రెడ్డికి కాకుండా ధనుంజయ రెడ్డికి ఇస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ అది కుదరలేదు. ఇప్పుడు లిక్కర్ కేసులో జైలుకెళ్లిన ధనుంజయ రెడ్డి..రాజకీయ బరిలోకి దిగుతారని అంటున్నారు. ధనుంజయ రెడ్డి అడిగితే జగన్ రాయచోటి సీటును ఆయనకు ఇచ్చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ ఇప్పటికీ ముగ్గురు నేతల పేర్లు రాయచోటి టికెట్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా టీడీపీలో ఉండి రాజంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు ఫ్యాన్ పార్టీలోనే ఉన్నారు. ఆయన అధికార పార్టీని వదిలేసి వైసీపీలో చేరడం వెనుక పెద్ద వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే..రాయచోటి నుంచి లక్కిరెడ్డి పల్లి విడిపోయే అవకాశం ఉందట. అప్పడు లక్కిరెడ్డిపల్లి టికెట్ దక్కుతుందనే వ్యూహంతోనే వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారట సుగవాసి.
Also Read: వైసీపీ నుంచి వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తామంటున్నారా? అసలు వెళ్లింది ఎందుకు, వస్తామంటున్నది దేనికి..
రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సొంత సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి నేరుగా చంద్రబాబుతో సంబంధాలున్న వ్యక్తి. ఆయన టీడీపీలో యాక్టీవ్‌గా ఉంటూ కడప జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇకపోతే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సొంత సోదరుడు ఎప్పటి నుంచో రాయచోటి టీడీపీలో కీలకమైన రాజకీయాలు చేస్తున్నారు. అన్న ఒక పార్టీలో..తమ్ముడు మరో పార్టీలో ఉన్నారనేది..ఈ ఇద్దరు నేతలకు ఇబ్బందిగా మారింది. ఇంతకీ వైసీపీ గడప తొక్కిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల ముందు సైడ్ ట్రాక్ మార్చిన రమేష్ రెడ్డిల పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి. బైచాన్స్ లక్కిరెడ్డి పల్లి విడిపోయినా నలుగురిలో ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కుతుంది.
మొన్నటిదాకా రాయచోటి టీడీపీలో సుగవాసి ప్రసాద్ బాబు, రమేష్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకా నాథ్ రెడ్డి ఉన్నారు. టికెట్ మండిపల్లికి ఇవ్వడంతో రమేష్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. చివరివరకు టీడీపీలో రాజంపేట పార్లమెంట్ సీట్ ఆశించి భంగపాటు పడిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఫ్యాన్ కిందకు వచ్చారు.
ఇక ద్వారకానాథ్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి టీడీపీలో ఉంటూ సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. లాస్ట్ మూమెంట్‌లో టికెట్ దక్కకపోవడంతో రమేష్ రెడ్డి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ఉన్న ఈ నేతలు సేమ్ సీన్‌ను రిపీట్ చేస్తారా? అందరినీ అకామిడేట్ చేసేందుకు జగన్ ఎలాంటి ఫార్ములా వాడతారనేది చూడాలి.