Google Data Centre: గూగుల్ డేటా సెంటర్‌పై డైలాగ్ వార్‌లో కొత్త టర్న్.. రంగంలోకి టీడీపీ.. నెక్ట్స్ ఏం జరగనుంది?
గూగుల్ పెట్టుబడులపై ఏపీలో రాజకీయం దుమారం ఒకవైపు కొనసాగుతుండగానే పొరుగు రాష్ట్రమైన కర్ణాటక సర్కార్ రియాక్షన్ ఆసక్తికరంగా మారింది.
Google Data Centre: అక్కడ వాళ్లు పవర్‌లో ఉన్నారు. ఇక్కడ వీళ్లు అధికారంలో ఉన్నారు. చేసిన మంచి చెప్పుకునేందుకు వీళ్లు..అక్కడి ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు వాళ్లు..ఎఫర్ట్స్ బానే పెడుతున్నారు. ఏపీకి వచ్చిన గూగుల్ డేటా సెంటర్‌పై..కర్ణాటక కాంగ్రెస్ వర్సెస్ ఏపీ టీడీపీ అన్నట్లుగా ట్వీట్ వార్ నడుస్తోంది. మొన్నటివరకు కర్ణాటక మంత్రులు వర్సెస్ ఏపీ మినిస్టర్ లోకేశ్ అన్నట్లుగా నడిచిన డైలాగ్ వార్ కాస్త..ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఫైట్‌గా మారిపోయింది. అసలు గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయ రచ్చ ఎందుకు? కర్ణాటక కాంగ్రెస్‌ది అక్కసా? లేక కవర్ డ్రైవా?
స్టేట్స్ ట్వీట్ వార్..ఓవర్ పార్టీస్ అయిపోయింది. పెట్టుబడులు, కంపెనీల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్, కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ప్రియాంక్ ఖర్గే మధ్య కొన్ని రోజులుగా ట్వీట్ వార్ నడుస్తోంది. అది ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ వర్సెస్ ఏపీ టీడీపీ అన్నట్లుగా మారిపోయింది. లేటెస్ట్‌గా కర్ణాటక కాంగ్రెస్ ట్విట్టర్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. కర్ణాటక గూగుల్ డేటా సెంటర్‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు.
ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. పెట్టుబడుల కోసం అడుక్కోబోమంటూ ట్వీట్ చేసింది కర్ణాటక కాంగ్రెస్. ఈ ట్వీట్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పటివరకు కర్ణాటక మంత్రుల వ్యాఖ్యలకు, ట్వీట్లకు మినిస్టర్ లోకేశ్ రిప్లై ఇస్తే..ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్‌కు..టీడీపీ కౌంటర్ ఇచ్చేసింది. ఏపీ డెవలప్‌మెంట్ కర్ణాటక కాంగ్రెస్‌కు ఫేవరెట్ టాపిక్ అయిపోయిందని టీడీపీ రివర్స్ అటాక్ చేసింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటు అనిపిస్తోందంటూ తిప్పికొట్టింది.
గూగుల్ డేటా సెంటర్ అగ్రిమెంట్ కంటే ముందే..కంపెనీల విషయంలో రచ్చ స్టార్ట్ అయింది. బెంగళూరు పరిసరాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టినా..తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని..కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవని..తాము బెంగళూరు నుంచి వెళ్లిపోతామంటూ పలు కంపెనీల సీఈవోలు ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. వారి ట్వీట్స్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్ రియాక్ట్ అవుతూ..ఏపీకి వెల్‌కమ్ చెప్పారు. అయితే కర్ణాటకలో పొలిటికల్ ఫైట్‌తో రాజుకుంటున్న సెగ కాస్త ఏపీకి తాకుతోంది. వరుసగా పలు కంపెనీల ప్రతినిధుల అసంతృప్తి, ఆ తర్వాత ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడంతో..కర్ణాటక కాంగ్రెస్ సర్కార్‌ను కార్నర్ చేస్తోంది బీజేపీ.
సిద్ధరామయ్య సర్కార్ ఫెయిల్యూర్ వల్లే అంటూ బీజేపీ అటాక్..
సిద్ధరామయ్య సర్కార్ ఫెయిల్యూర్ వల్లే బెంగళూరుకు రావాల్సిన పరిశ్రమలకు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని..అక్కడి బీజేపీ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. తమ రాష్ట్రంలోని ప్రతిపక్షాల విమర్శలకు రియాక్ట్ అయ్యే క్రమంలో..ఏపీ మీద ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కుతున్నారు కర్ణాటక కాంగ్రెస్ నేతలు. ఏపీకి గూగుల్ సెంటర్ రావడానికి కూటమి సర్కార్ ఇచ్చిన భారీ రాయితీలే కారణమని కర్ణాటక కాంగ్రెస్ చెబుతోంది. కర్ణాటక బీజేపీ మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్ వల్లే డేటా సెంటర్ ఏపీకి పోయిందని అటాక్ చేస్తోంది. ఇదే ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ వర్సెస్ ఏపీ టీడీపీ ట్వీట్ వార్‌కు దారి తీసింది.
రంగంలోకి టీడీపీ.. కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ..
గూగుల్ పెట్టుబడులపై ఏపీలో రాజకీయం దుమారం ఒకవైపు కొనసాగుతుండగానే పొరుగు రాష్ట్రమైన కర్ణాటక సర్కార్ రియాక్షన్ ఆసక్తికరంగా మారింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు కల్పించే గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడంపై..సిలికాన్ వ్యాలీగా ఉన్న కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. డేటా సెంటర్ ఏపీకి తరలిపోయేలా చేశారంటూ కర్ణాటక బీజేపీ..సిద్ధరామయ్య సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తుంది. అయితే ప్రతిపక్షం విమర్శల నుంచి తప్పించుకోవడం ఒక ఎత్తు అయితే, తమ మంత్రులతో ట్వీట్ వార్‌కు దిగుతున్న ఏపీ మంత్రి లోకేశ్ జోరుకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ విమర్శలకు దిగుతోంది. దీంతో ఏపీ టీడీపీ రంగంలోకి దిగి..కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది.
మరోవైపు కర్ణాటక బీజేపీ నేతలు లోకేశ్, కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ..అక్కడి కాంగ్రెస్ సర్కార్ విమర్శిస్తూ ట్వీట్లు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. గూగుల్ డేటా సెంటర్ కోసం అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచే ఇంత రాద్దాంతం జరుగుతుంటే..వన్స్ గూగుల్ డేటా సెంటర్ ల్యాండ్ అయిపోతే సీన్ ఎలా ఉంటుందోనన్న డిస్కషన్ జరుగుతోంది. గూగుడ్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయ రచ్చ ఆగేదెప్పుడో చూడాలి.
