Varuna Reddy: కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ

కడప సెంట్రల్ జైలుకు జైలర్‌గా ఉన్న వివాదాస్పద పోలీసు అధికారి వరుణారెడ్డిని బదిలీ చేసింది ప్రభుత్వం. వరుణారెడ్డి ఒంగోలు జైలర్‌గా బదిలీ అయ్యారు.

Varuna Reddy: కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ

Govt Transfers YSR Kadapa Central Jailer to Ongole

Updated On : February 15, 2022 / 3:43 PM IST

Varuna Reddy: కడప సెంట్రల్ జైలుకు జైలర్‌గా ఉన్న వివాదాస్పద పోలీసు అధికారి వరుణారెడ్డిని బదిలీ చేసింది ప్రభుత్వం. వరుణారెడ్డి ఒంగోలు జైలర్‌గా బదిలీ అయ్యారు. అదే సమయంలో, ఒంగోలు జైలు సూపరింటిండెంట్‌గా ఉన్న ప్రకాశ్‌ను కడప జైలుకు బదిలీ చేసింది ప్రభుత్వం. వరుణారెడ్డిని కడప సెంట్రల్ జైలుకు ఈ నెల మూడో తేదీనే జైలర్‌గా నియమించింది ప్రభుత్వం.

అయితే, గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను అనంతపురం జైల్లోనే హత్యకు గురైనప్పుడు వరుణారెడ్డి జైలర్‌గా ఉన్నాడని, ఇప్పుడదే వరుణారెడ్డి కడప జైలర్‌గా వేశారని, అదే జైలులో ఉన్న వివేకానంద రెడ్డి హంతకులకు ప్రాణహాని ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

వరుణా రెడ్డిపై అనేక శాఖపరమైన కేసులు ఉన్నాయని, వివేకా హంతకులు రిమాండ్‌లో ఉన్న జైలుకే వరుణారెడ్డి జైలర్‌గా రావడంపై సీబీఐ డైరెక్టర్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య కూడా లేఖ రాశారు.

కడప జిల్లా జైలర్‌ వరుణారెడ్డిని బదిలీ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే వరుణారెడ్డి బదిలీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసులో పలు అంశాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్న సమయంలో ఈ పరిణామం కూడా జరిగింది.