Anandayya Ayurvedic Medicine: ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. హాని లేదు.. కానీ!
దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Ana
Anandayya Ayurvedic Medicine: దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. CCRAS తన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం కంట్లో వేసే డ్రాప్స్‌కు తప్ప ఇస్తున్న మిగిలిన మందులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఆనందయ్య ఇచ్చే పి,ఎల్,ఎఫ్ మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, కంట్లో వేసే మందుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా.. నివేదికలు వచ్చిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది.
ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎటువంటి హానిలేదని తేల్చిన సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని చెప్పింది.
కంట్లో వేసే మందుపై నివేదికలు రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందని, ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చునని చెప్పింది.
ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్లాలని ప్రోటోకాల్ పాటించాలని సూచించింది.