Gudivada Casino : కాసినో.. పెట్రోల్.. కొడాలి నాని సవాల్‌ను స్వీకరించిన నేతలు
చీర్‌గాళ్స్ ద్వారా డ్యాన్సులు చేయించారని, ప్రత్యేకంగా లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో స్టెప్పులేయించారంటూ ఆరోపణలు చేస్తుండడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి

Kodali Nani Vs Bonda
Gudivada Casino Fight : గుడివాడ కాసినో వ్యవహారం ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అట్టుడుకుతోంది. తన కన్వెన్షన్‌లో కాసినో జరిగిందని నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని తగులపెట్టుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు రియాక్ట్ అయ్యాయి. నాని సవాల్‌ను స్వీకరించారు టీడీపీ నేత బోండా ఉమా. కే కన్వెన్షన్‌లో కాసినో జరిగిందని.. జరగలేదని నిరూపిస్తే తాను పెట్రోల్ పోసుకుంటానంటూ ప్రతి సవాల్ విసిరారు బొండా ఉమా.
Read More : LS Privileges Panel : బండి సంజయ్ అరెస్టు వ్యవహారం.. లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్
సంక్రాంతి పండుగ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాసినో సంస్కృతి రాజకీయాలను కుదిపేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు టీడీపీ నేతలు. దీంతో గుడివాడలో క్యాసినో గేమ్స్‌పై పోలీసు శాఖ విచారణ జరుపుతోంది. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును విచారణాధికారిగా నియమించారు ఎస్పీ. వీలయినంత త్వరగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. గోవా తరహలో ఏర్పాటయిన క్యాసినో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్‌లో సంక్రాంతి సంబరాల ముసుగులో యదేచ్చగా క్యాసినో జరిగిందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.
Read More : Reliance Digital : ‘డిజిటల్ ఇండియా సేల్’.. అదిరిపోయే ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు!
చీర్‌గాళ్స్ ద్వారా డ్యాన్సులు చేయించారని, ప్రత్యేకంగా లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో స్టెప్పులేయించారంటూ ఆరోపణలు చేస్తుండడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అంతేగాకుండా…టీడీపీ నిజనిర్ధారణ కమిటీ క్యాసినో జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించడంతో.. గుడివాడ నివురుగప్పిన నిప్పులా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.