Allagadda Politics : ఆళ్లగడ్డలో హై టెన్షన్‌.. భారీగా మోహరించిన పోలీసులు!

Allagadda Politics : ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. ఏం క్షణం ఏమి జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Allagadda Politics : ఆళ్లగడ్డలో హై టెన్షన్‌.. భారీగా మోహరించిన పోలీసులు!

High Tension In Allagadda _ Bhuma Akhila Priya Warns AV Subba Reddy

Updated On : October 18, 2024 / 12:34 AM IST

Allagadda Politics : ఆళ్లగడ్డలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ వదిలి వెళ్లిపోవాలంటూ అఖిలప్రియ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఏవి సుబ్బారెడ్డిపై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు ద్వారా భూమా అఖిలప్రియ ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఏమి జరిగిన తేల్చుకుంటానని ఏవి సుబ్బారెడ్డి చెబుతుండటంతో ఆయన్ను ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరో చెప్తే నేనెందుకు ఆళ్లగడ్డ వదిలి వెళ్తానంటున్న ఏవి సుబ్బారెడ్డి అంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి కి భూమా అఖిలప్రియ కొన్నిరోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఉండకూడదని పోలీసులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆయన స్వగృహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Read Also : మేనమామతో గొడవపడ్డ అఖిలప్రియ.. తండ్రి భూమాతో పోల్చితే డిఫరెంట్ పాలిటిక్స్