Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిని సర్వే చేసిన అధికారులు..
ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లు కట్టారని ఆరోపణలు రావడంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే ఇంటిని సర్వే చేస్తున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కలెక్టర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారంటూ గతంలోనే మున్సిపాలిటీ అధికారులు పెద్దారెడ్డికి మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. అయితే పెద్దారెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర సర్వే చేసేందుకు కలెక్టర్ ఆదేశించారు.
Also Read: ఆ వైసీపీ సీనియర్ నేత అందుకే గుమ్మం దాటట్లేదా?
ఇవాళ మున్సిపల్ అధికారులు, జిల్లా సర్వేయర్ రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేశారు. ఇంటి కొలతలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సర్వే చేసిన అధికారులు నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తామన్నారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని తెలుస్తోంది.