AP High Court : హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్‌కు ఉరిశిక్షను రద్దుచేసిన ఏపీ హైకోర్టు.. 45ఏళ్లు జైలు శిక్ష

లారీలను గల్లంతు చేసి బాడీలు మాయం చేయడం, వాటిని మిస్సింగ్ హిస్టరీగా మార్చడంలో మున్నా గ్యాగ్ ఆరితేరింది. 2008 అక్టోబర్ నెలలో ఇనుము లోడుతో..

AP High Court : హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్‌కు ఉరిశిక్షను రద్దుచేసిన ఏపీ హైకోర్టు.. 45ఏళ్లు జైలు శిక్ష

AP High Court

Updated On : May 12, 2024 / 11:16 AM IST

AP High Court Munna Gang : మూడు దశాబ్దాల క్రితం జాతీయ రహదారిపై నిశబ్ద మారణకాండ సృష్టించిన మున్నా గ్యాంగ్ కు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ గ్యాంగ్ హైవేలపై 13మందిని మట్టుబెట్టి దారుణాలకు పాల్పడింది. ఇనుము లోడుతో వెళ్లే లారీలే లక్ష్యంగా మున్నా గ్యాంగ్ మారణకాండ సాగింది. హైవేపై రక్తం పారించిన ఆ గ్యాంగ్ లోని 12 మందికి 2021 మే నెలలో ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు జిల్లా సెషన్స్‌ కోర్టులో న్యాయమూర్తి మనోహర్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. మున్నా గ్యాంగ్ లో 12మందికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవం, ఒకరికి 10ఏళ్లు, మరొకరికి ఏడేళ్ళు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు తీర్పు సంచలనం రేపింది.

Also Read : Police Seize Money : ఎన్నికల వేళ హైదరాబాద్ ఫిలిం నగర్‌లో కలకలం.. భారీగా నగదు స్వాధీనం

జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. తాజాగా ఏపీ హైకోర్టు దోషుల పిటీషన్ పై విచారణ జరిపింది. జిల్లా కోర్టు తీర్పును కొట్టివేసి.. దోషుల శిక్షను 45 సంవత్సరాల యావజ్జీవంగా మారుస్తూ డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌, జస్టిస్‌ గన్నమనేని రామకృష్టప్రసాద్‌లు తీర్పునిచ్చారు. అయితే, యావజ్జీవ శిక్ష కాలంలో ఎలాంటి క్షమాభిక్ష ప్రసాదించేందుకు అవకాశం లేదని తీర్పులో డివిజినల్ బేంచ్ స్పష్టం చేసింది. అదేవిధంగా జాతీయ రహదారిపై ఇలాంటి హంతకులను నిలువరిచడంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్యం విఫలం చెందిందని ఆంక్షేపించింది.

Also Read : Dgp Ravi Gupta : 73వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు- ఎన్నికల ఏర్పాట్లపై డీజీపీ రవి గుప్త

కనిగిరికి చెందిన ఎండీ అబ్దుల్‌సమాద్‌ అలియాస్‌ మున్నా అనే వ్యక్తి తొలుత నాటు వైద్యుడుగా అవతరించి, కొద్దికాలంకు గుప్తనిధులు తవ్వకాలకోసం ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. 17మంది సభ్యులుగా ముఠాగా ఏర్పడ్డారు. కొద్దికాలంకు జాతీయ రహదారిపై తనిఖీల పేరుతో ఆర్టీవో అధికారుల అవతారమెత్తి ఇనప లోడుతో వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకొని డ్రైవర్‌, క్లీనర్‌లను దారుణంగా హత్య చేసి గుండ్లకమ్మ నదీ ఒడ్డున ఇసుకలో మున్నా గ్యాంగ్ పూడ్చి వేసింది. అనంతరం ఇనుప లోడు లారీలను మద్దిపాడు కొష్టాలు సమీపంలోని ఓ గోదాంలోకి తీసుకెళ్లి ఇనుమును విక్రయించి, లారీలను పార్టులుగా ఊడదీసి పాత ఇనుముకు విక్రయించేవారు. 2008లో ఈ హైవేపై కిల్లర్ హత్యల పరంపర కొనసాగింది. ముఠా సభ్యుల్లో 13 మంది హత్యల్లో పాల్గొన్నట్లు సాక్షాదారాలతో కోర్టులో నిరూపితమైంది.

Also Read : Lok Sabha Elections 2024 : రాష్ట్రమంతా 144 సెక్షన్, 160 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత- ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్

లారీలను గల్లంతు చేసి బాడీలు మాయం చేయడం, వాటిని మిస్సింగ్ హిస్టరీగా మార్చడంలో మున్నా గ్యాగ్ ఆరితేరింది. 2008 అక్టోబర్ నెలలో ఇనుము లోడుతో తమిళనాడులోని కల్పకం వెళుతూ ఒంగోలు సమీపంలో లారీ మాయమవ్వడంతో లారీ యజమాని ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఎస్పీగా పనిచేసిన నవీన్ చంద్ రావు.. కేసు దర్యాప్తు అధికారిగా ప్రస్తుతం పీటీసీ ప్రిన్సిపాల్, అప్పట్లో ట్రైనీ డీఎస్పీగా ఉన్న దామోదర్ నియామకం చేశారు. ఇంజన్ లేకుండా లారీ బాడీ పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో దొరకడంతో తీగలాగితే డొంక కదిలినట్లుగా మున్నా గ్యాంగ్ మారణహోమం బట్టబయలైంది. దాని ఆధారంగా వెల్డింగ్ చేసే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మున్నాగ్యాంగ్ ను పట్టుకొని పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో 2021లో ఉరిశిక్ష పడిన వారిలో ఎండీ. అబ్దుల్‌ సమాద్‌ అలియాస్‌ మున్నా, షేక్‌ రి యాజ్‌, హిదయతుల్లా, జమాల్‌, బత్తుల సాల్మన్‌, ఏపూరి చినవీరస్వామి, పెదవీరస్వామి, గుండా భా నుప్రకాష్‌, రాచమల్లు సంపత్‌, గుండెబోయిన శ్రీధర్‌, షేక్‌ హఫీజ్‌, షేక్‌ దాదపీర్‌ లు ఉన్నారు. ప్రస్తుతం వారికి ఉరిశిక్ష ను తొలగిస్తూ ఏపీ హైకోర్టు 45ఏళ్లు యావజ్జీవన జైలు శిక్షను విధించింది.