అద్దె అడిగాడని యజమానిని కొట్టి చంపిన అద్దెకుండే వ్యక్తి

అద్దె అడిగాడని యజమానిని కొట్టి చంపిన అద్దెకుండే వ్యక్తి

Updated On : March 2, 2021 / 4:32 PM IST

house owner killed by tenant in west godavari district,Palakollu : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని అద్దెకుండే వ్యక్తి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.

స్ధానిక ముచ్చర్ల వారి వీధిలోని వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో చిన కొండయ్య కుటుంబం ఏడాది కాలంగా అద్దెకు ఉంటున్నారు. గత రెండు నెలలుగా చిన కొండయ్య ఇంటి అద్దె చెల్లించటంలేదు. ఈ క్రమంలో మార్చి నెల రావటంతో యజమాని ప్రసాద్ సోమవారం రాత్రి   చిన కొండయ్యను అద్దె చెల్లించమని అడిగాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.  వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చిన కొండయ్య పక్కనే ఉన్న  రాయి తీసుకుని ప్రసాద్ తలపై కొట్టాడు. ఆ దెబ్బకు ప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలి   చనిపోయాడు. ఈ విషయం గ్రహించిన చినకొండయ్య నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. ఘటనా స్ధలానికి వచ్చి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.