Huge Fire : విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన టీవీఎస్ షోరూం, కాలి బూడిదైన 500 బైకులు
భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

Vijayawada Huge Fire
Huge Fire In Vijayawada : ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టెల్లా కాలేజ్ సమీపంలోని టీవీఎస్ షోరూమ్ లో మంటలు చెలరేగాయి. టీవీఎస్ షోరూం అగ్నికి ఆహుతి అయింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు షోరూంలోని కొత్త బైకులు కాలి బూడిదయ్యాయి.
భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. గంగారం జేపీ సినిమాస్ లో చేలరేగిన మంటలు
అగ్ని ప్రమాదంలో షో రూమ్ భారీగా దగ్ధం అయింది. అగ్ని ప్రమాదం సమయంలో షో రూమ్ లో 600కు పైగా టూ వీలర్స్ ఉన్నాయి. 500 ఎలక్ట్రిక్, పెట్రోల్ వాహనాలు తగల పడ్డాయి. షో రూమ్ లో ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.
దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.
Udyan Express : ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
టీవీఎస్ షోరూం యజమాని సతీష్
తెల్లవారుజామున 5 గంటల సమయంలో షోరూంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని వాచ్ మెన్ ఫోన్ చేశాడని టీవీఎస్ షోరూం యజమాని సతీష్ పేర్కొన్నారు. వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చి బయల్దేరి వచ్చామని తెలిపారు. అప్పటికే షోరూం పూర్తిగా మంటలతో నిండిపోయిందన్నారు. షోరూం లోపల 500 కొత్త ద్విచక్ర వాహనాలు ఉన్నాయని వెల్లడించారు.
షోరూం బ్యాక్ సైడ్ సర్వీస్ ద్విచక్ర వాహనాలు 150 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. సర్వీస్ వాహనాలు, కొత్త వాహనాలు కలిపి మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలపైనే నష్టం వాటిల్లిందని చెప్పారు. కొత్త వాహనాలకు ఇన్సూరెన్స్ పూర్తిగా వస్తుందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ అయిందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది తాము కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.