Guntur District : ఉండవల్లి పంట పొలాల్లో భారీ కొండచిలువ.. భయాందోళనలో రైతులు

భారీ వర్షాలకు పలుచోట్ల కొండచిలువలు ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కనిపించిన ఓ కొండచిలువ రైతుల్ని ఆందోళనకు గురి చేసింది.

Guntur District : ఉండవల్లి పంట పొలాల్లో భారీ కొండచిలువ.. భయాందోళనలో రైతులు

Updated On : July 28, 2023 / 8:11 AM IST

Guntur District : ఓ వైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంటే మరోవైపు పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చి  ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో కనిపించిన భారీ కొండచిలువ రైతుల్ని భయాందోళనలకు గురి చేసింది.

Python fight with man : గుడ్లు తీయబోయిన వ్యక్తిని కాటేయడానికి ప్రయత్నించిన కొండచిలువ .. వణుకు పుట్టించిన వీడియో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వణికిపోతున్న జనాన్ని పాములు, కొండచిలువలు మరింత భయపెడుతున్నాయి. ఇటీవల పలుచోట్ల కొండచిలువలు కనిపించిన వార్తలు విన్నాం. తాజాగా గుంటూరు జిల్లా ఉండవల్లి పంట పొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది. పొలాల మీదుగా రహదారిపై వెడుతున్న కొండచిలువను చూసి జనం హడలిపోయారు.

Python Coils Leg : వ్యక్తి కాలుని చుట్టుకున్న కొండచిలువ.. అతడిని కాపాడేందుకు ఎంత కష్టపడ్డారో.. వీడియో

తెల్లవారు ఝామున రైతులు ఈ కొండచిలువను చూసారు. కూలిపనులకు వెళ్తుండగా ఇది వారి కంట పడింది. అటవీ శాఖ వారు స్పందించి కొండచిలువను పట్టుకుని తమ ప్రాణాలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.