Vidadala Rajani : ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకంలోనూ విడదల రజనీకి ప్రాధాన్యత

ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకంలోనూ మంత్రి విడదల రజనీకి ప్రాధాన్యత ఇచ్చారు. అత్యంత కీలకమైన విశాఖ జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా నియమించారు.

Vidadala Rajani : ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకంలోనూ విడదల రజనీకి ప్రాధాన్యత

Rajani

Updated On : April 19, 2022 / 8:35 PM IST

vidadala Rajani : తొలిసారి మంత్రి పదవి చేపట్టిన విడదల రజనీకి ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకంలోనూ రజనీకి ప్రాధాన్యత ఇచ్చారు. అత్యంత కీలకమైన విశాఖ జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా విడదల రజనీని నియమించారు. దీంతో ప్రభుత్వంలో ఆమెకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా డెవలప్ చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందన్న విషయం తెలిసిందే. ఏపీలోని 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా పి.రాజన్నదొర, కాకినాడ ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా సిదిరి అప్పలరాజు, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా గుడివాడ అమర్నాధ్, పశ్చిమగోదావరి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా దాడిశెట్టి రాజా, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా పి.విశ్వరూప్‌ నియామకం అయ్యారు.

YCP : ఏపీలోని 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన వైసీపీ

విజయనగరం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ముత్యాలనాయుడు, అమలాపురం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా జోగి రమేశ్, అన్నమయ్య జిల్లా – కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా-పెద్దిరెడ్డి, తిరుపతి- నారాయణస్వామి, నంద్యాల- అంజాద్ బాషా, కర్నూలు-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సత్యసాయి జిల్లా-జయరాం, చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉషా శ్రీ చరణ్, విశాఖ-విడదల రజనీ, ఒంగోలు-మేరుగ నాగార్జునను నియమించారు.

తూర్పుగోదావరి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా తానేటి వనిత, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా కొట్టు సత్యనారాయణ, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రోజా, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా అంబటి రాంబాబు, కడప ఆదిమూలపు సురేశ్ కు బాధ్యతలు అప్పగించారు.