Chandrababu Naidu : పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు తీరని అన్యాయం జరిగింది- చంద్రబాబు తీవ్ర ఆవేదన
తండ్రిని చంపిన వ్యక్తులను శిక్షించాలని ప్రాణాలకు లెక్క చేయకుండా ఆమె పోరాడుతోంది. Chandrababu Naidu

Chandrababu Naidu - YS Sharmila(Photo : Twitter, Google)
Chandrababu Naidu – YS Sharmila : పులివెందులలో బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సింహగర్జన చేశారు. ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నోట వైఎస్ షర్మిల పేరు వినిపించింది. పులివెందుల ఆడబిడ్డ వైఎస్ షర్మిలకు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు వాపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులు సమభాగం అన్నాడు. కానీ ఆయన చేశాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సమాన హక్కు కూడా షర్మిలకు లేదా అని నిలదీశారు.
”1978లో నేను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం. బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వ్యక్తులకు మీరూ నేను ఓ లెక్కన. సీబీఐ ఎంక్వైరీ కావాలి అన్నారు పులివెందుల పులి వైఎస్ సునీత. నా తండ్రిని చంపిన వ్యక్తులను శిక్షించాలని ప్రాణాలకు లెక్క చేయకుండా ఆమె పోరాడుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో మీకు తెలియదా?
ముఖ్యమంత్రి.. నీ విశ్వసనీత ఎక్కడ? మీ బాబాయిని చంపిన వ్యక్తిని నీ పక్కన పెట్టుకుని నువ్వు గులకడం లేదా? నాకు అడ్డు వస్తే సైకిల్ స్పీడ్ పెంచి అడ్డు వచ్చిన వారిని తొక్కుకుంటూ పోతా. కోడి కత్తి ఒక మనిషిని చంపడానికి తెస్తారా? కోడి కత్తి డ్రామా చేసి ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకున్నాడు. కోడి కత్తి కేసులో కుట్ర లేదంటే మళ్లీ రివ్యూ చేయాలని కోరుతున్నాడు” అని సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు.