CM Jagan-Kotamreddy : సీఎం జగన్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ
సీఎం జగన్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కోటంరెడ్డి జగన్ తో భేటీ అయ్యారు. కొంతకాలంలో అధికారుల తీరుతో అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డి సీఎంతో భేటీ కోసం పలుమార్లు కోరారు. దీంతో ఎట్టకేలకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వటంతో క్యాంపు కార్యాలయంలో వీరిద్దరు సమావేశమయ్యారు.

CM Jagan, Kotamreddy Sridhar Reddy meet
CM Jagan-Kotamreddy Sridhar Reddy : సీఎం జగన్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కోటంరెడ్డి జగన్ తో భేటీ అయ్యారు. కొంతకాలంలో అధికారుల తీరుతో అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డి సీఎంతో భేటీ కోసం పలుమార్లు కోరారు. దీంతో ఎట్టకేలకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వటంతో క్యాంపు కార్యాలయంలో వీరిద్దరు సమావేశమయ్యారు.
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన నియోజక వర్గంలో సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులపై కూడా ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో అధికారులు తాను చెప్పిన పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటంరెడ్డికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. ఏవిషయం అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తారని అంటుంటారు. తన ఆదేశాలు పట్టించుకోని అధికారులపై బహిరంగంగానే విమర్శలు చేయటానికి గానీ..ఉమ్మారెడ్డి గుంట మురుగునీటి కాల్వలో బైఠాయించిన విషయంలో గానీ ఎటువంటి మొహమాటానికి వెనుకాడరు. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడేయటం ఆయన నైజం. అందుకే తాను ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సమస్యలపై విమర్శలు చేయటానికి కూడా వెనుకాడని కోటంరెడ్డి జగన్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి మొహమాటం లేకుండా, నిర్భయంగా, బాహటంగా విమర్శనాస్త్రాలను గుప్పించే కోటం రెడ్డి మరి సీఎం జగన్ తో కూడా తనదైన శైలిలోనే సూటిగా మాట్లాడతారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఫైర్ బ్రాండ్ లాంటి కోటంరెడ్డి భేటీ అత్యధిక ప్రాధాన్య సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితమే తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపై అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి కూడా నిధులు ఉండట్లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. నేను శాసన సభ్యుడినా? కదా? అనే విషయంపై తనకే అనుమానంగా ఉందంటూ సెటైరిక్ గా వ్యాఖ్యలు చేశారు ఆనం. ఇప్పుడు కోటంరెడ్డి సీఎంతో భేటీ..పైగా ఫైర్ బ్రాండ్ మరి తనదైన బ్రాండ్ తోనే సీఎం జగన్ తో మాట్లాడతారా?అసలు ఎందుకు కోటంరెడ్డి జగన్ తో భేటీ అవుతున్నారు?ఏఏ విషయాలు మాట్లాడతారు?అనే విషయం ఆసక్తికరంగా మారింది.