Student Died : ఎగ్జామ్‌ రాస్తూ ఇంటర్‌ విద్యార్థి మృతి

ఎగ్జామ్ రాస్తుండగా కార్తీక్‌కు అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికిత్సం కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Student Died : ఎగ్జామ్‌ రాస్తూ ఇంటర్‌ విద్యార్థి మృతి

Student Died

Updated On : May 18, 2022 / 2:22 PM IST

student died : శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఎగ్జామ్‌ రాస్తూ ఇంటర్‌ విద్యార్థి మృతి చెందాడు. సావరకోట మండలం దాసుపురం గ్రామానికి చెందిన కార్తీక్‌.. మహేంద్ర జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. పాతపట్నం బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కిరణ్మయి జూనియర్‌ కాలేజీలో కార్తీక్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ ఎగ్జామ్‌ రాస్తున్నాడు.

School Building : తీవ్ర విషాదం.. ఆడుకోవడానికి స్కూల్‌కి వెళ్లిన విద్యార్థి మృతి

ఎగ్జామ్ రాస్తుండగా కార్తీక్‌కు అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికిత్సం కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాలేజీ, హాస్టల్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.