’హోదా’ను వదిలేసి.. ప్యాకేజీకి చంద్రబాబు ఊ కొట్టారు : జగన్

హైదరాబాద్ : నాలుగు నెలలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ లో వాగ్ధానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయడమేనని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఐదో బడ్జెట్ లోనూ ఏపీకి రావాల్సిన వాటిపై ప్రకటన లేదన్నారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్, హోదాపై అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చించారు. ప్రత్యేక హోదాను వదిలేసి లేని ప్యాకేజీకి చంద్రబాబు ఊ కొట్టారని ఆరోపించారు.
సీఎం చేతకాని వారైతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ఉంటాయో..సీఎం చంద్రబాబే ఉదాహరణ అని విమర్శించారు. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురంచి మాట్లాడకూడదన్న కనీసం జ్జానం చంద్రబాబుకు లేదన్నారు. నాలుగేళ్లు కేంద్ర కేబినెట్ లో ఉన్న టీడీపీ ఎంపీలు ఏం చేశారని ప్రశ్నిస్తే చంద్రబాబు ఏం మాట్లాడరు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలకు గుణపాఠం తప్పదన్నారు.