క్లాస్‌రూంలో విద్యార్థులతో కలిసి గడిపి.. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ప్రారంభించిన సీఎం జగన్

Jagananna Vidya Kanuka kits: చదువుకు భరోసానిస్తూ.. ఏపీ cm jagan ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిముళ్ల సురేశ్ తో పాటు తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఈ మేరకు స్కూల్ కు వెళ్లిన సీఎం ఏర్పాట్లన్నీ స్వయంగా వెళ్లి పరిశీలించారు.
క్లాస్ రూంకెళ్లారు. స్టూడెంట్స్‌తో మాట్లాడారు. వాళ్ల పక్కనే బెంచిమీద కుర్చొని కబుర్లు చెప్పారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయని వాళ్లను అడిగారు. వాళ్ల సమాధానాలతో హ్యాపీగా ఫీలయ్యారు జగన్.
ఈ పథకం కింద విద్యార్థులకు ప్రోత్సాహాకాలను అందజేయనున్నారు.
* 1నుంచి 5వ తరగతివరకూ పాఠ్యపుస్తకాలు
* మూడు జతల యూనిఫాం
* 1 బెల్ట్, 3జతల సాక్సులు, 1జత షూ
* అమ్మాయిలకు స్కై బ్లూ, అబ్బాయిలకు నేవీ బ్లూ
* కొవిడ్ నేపథ్యంలోమూడు మాస్కులు
లాంటి వస్తువులన్నీ ఈ పథకం కింద అందజేస్తారు.
స్కూల్స్ తెరవడానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఉన్నప్పటికీ ముందుగానే అందజేస్తే స్కూల్ తెరిచేసమయానికి యూనిఫాంలు కుట్టించుకుని రెడీ అవుతారని భావిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత రీ ఓపెన్ అవుతున్న స్కూల్స్ కు కొత్త ఉత్తేజంతో రావాలని అధికారులు చెబుతున్నారు.
చదువుకు ఎన్నటికీ తరగని ఆస్తి అని.. సీఎం మాట్లాడుతూ విద్యార్థులకు విలువైన సలహాలిచ్చారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 42లక్షల 34వేల 322మందికి రూ.650కోట్ల ఖర్చు వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కాసేపటి వరకూ విద్యార్థులతో కాసేపు గడిపారు. పిల్లలతో కలిసి కూర్చొని కాసేపు ముచ్చటించారు.