అక్టోబర్ 05న Jagananna Vidya Kanuka కిట్ లు..నవంబర్ 02న స్కూల్స్ ఓపెన్

Jagananna Vidya Kanuka : నవంబర్ 02వ తేదీన ఏపీలో స్కూల్స్ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు విద్యా కానుక కిట్ లు అందచేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీన పాఠశాలలు ప్రారంభమౌతున్న సందర్భంగా..అక్టోబర్ 02వ తేదీన విద్యా కానుక కిట్ లు అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడే పిల్లలకు కిట్ ఇస్తే స్కూళ్లు తెరిచేలోగా యూనిఫామ్ కుట్టించుకోగలుగుతారన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా 2020, సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన సమీక్ష జరిపారు.
ఎవరైనా దేని కోసమైనా దరఖాస్తు చేసుకుంటే 6 పాయింట్ వాలిడేషన్ డేటా ఎంట్రీలో తప్పుడు వివరాలు నమోదు చేయకూడదు. పక్కాగా ఎస్‌ఓపీ ఫాలో కావాలి.
ఫిర్యాదు చేయగానే అన్ని స్థాయిల్లో వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లబ్ధి దారునిగా అర్హత ఉంటే 17 రోజుల్లో పేరు జాబితాలో చేర్చాలి.
ఇలాంటి కేసులను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్‌గా 10 శాతం కేసులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి.
జేసీలు కనీసం 1 శాతం కేసులను ర్యాండమ్‌లో తనిఖీ చేయాలి.
అక్టోబర్ 2న దాదాపు 2 లక్షల మందికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేస్తున్నాం.
అక్టోబర్ ఆఖరులో జగనన్న తోడు పథకం ప్రారంభిస్తాం. ఈ పథకం కింద వీధుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు.
అర్హులందరికీ వచ్చే నెల 10లోగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చూడాలి.
రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు.
అమలాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల, ఆదోని, ఏలూరు, పులివెందులలో భూసేకరణ జరగాల్సి ఉంది.
కాకినాడ, ఒంగోలు, అనంతపురంలోని పాత కాలేజీలకు ఇంకా అదనపు భూమి కావాలి. వెంటనే ఆ మేరకు భూమి సేకరించాలి.
గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే ప్రక్రియలో జాయింట్ కలెక్టర్లు కాస్త నెమ్మదిగా ఉన్నారు.
వారానికి కనీసం నాలుగుసార్లు సచివాలయాలు సందర్శించి నివేదికలు పంపాలి. కలెక్టర్లు కూడా ఇంకాస్త చొరవ చూపాలి. అని సీఎం జగన్ వెల్లడించారు.