Pawan Kalyan Varahi Yatra: పవన్ నాల్గో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు.. టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత తొలిసారి ప్రజల్లోకి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర నాలుగో విడత షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి పవన్ యాత్రను ప్రారంభించనున్నారు.

Pawan Kalyan Varahi Yatra: పవన్ నాల్గో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు.. టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత తొలిసారి ప్రజల్లోకి

Jana Sena party chief Pawan Kalyan

Varahi Yatra Schedule: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  చేపట్టిన వారాహి విజయ యాత్ర  (Varahi Vijaya Yatra) నాలుగో విడత షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లా (Krishna District) లోని అవనిగడ్డ నుంచి పవన్ యాత్రను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 6వతేదీ వరకు యాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వారాహి యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పొత్తు ప్రకటన తరువాత తొలిసారి ప్రజల్లోకి పవన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో పవన్ వారాహి యాత్రపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

ఈసారి యాత్రపై సర్వత్రా ఆసక్తి..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నారు. రెండు రోజులు సీఐడీ అధికారులు బాబును జైలులో విచారించారు. అయితే, చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో లోకేశ్, బాలకృష్ణలతో కలిసి పవన్ ములాఖత్ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన పవన్.. వచ్చేఅ సెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు.

కొద్దికాలంగా టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే విషయంపై ఏపీ రాజకీయాల్లో సందిగ్దతకు పవన్ తెరదించారు. అయితే, టీడీపీ, జనసేన పార్టీల పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత తొలిసారి పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. దీంతో పవన్ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవన్ మూడో విడత వారాహి యాత్ర వరకు కేవలం జనసేన పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు యాత్రలో పాల్గొన్నారు. ఈసారి టీడీపీ శ్రేణులుసైతం పవన్ వారాహి యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.