AP Politics: ఇప్పుడున్నది రూపాయి పావలా ప్రభుత్వం.. జనసేన చీఫ్ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తాను ఇచ్చే పరిహారంతో మత్స్యకారుల కష్టం తీరదని, అయితే ప్రభుత్వాన్ని కదిలించేందుకే పరిహారం ఇచ్చానని అన్నారు. హార్బర్లో ప్రమాదానికి చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయి అనే సమాచారం ఉందని ఆయన ఆరోపించారు.

AP Politics: ఇప్పుడున్నది రూపాయి పావలా ప్రభుత్వం.. జనసేన చీఫ్ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

pawan kalyan at vizag harbor

ఇప్పుడున్నది రూపాయి పావలా ప్రభుత్వమని, ఐదేళ్ల కాలంలో హార్బర్లో లైట్లు వేయలేకపోయారని, ఇక ఆధునికీకరణ మాట అక్కర్లేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం పవన్ సందర్శించారు. అనంతరం ప్రమాదంలో దగ్ధమైన బోటు యజమానులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు.

అనంతరం పవన్ మాట్లాడుతూ అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీతో సహా మిగిలిన రాజకీయ పార్టీల్లా మత్స్యకారులను తాను ఎప్పుడు ఓట్ బ్యాంకులా చూడలేదని అన్నారు. వారికి ఎప్పుడు కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మత్స్యకారుల కష్టంలో తోడుగా ఉండాలని వచ్చినట్లు తెలిపారు. మరో నాలుగు నెలలు భరిస్తే వైసీపీ ప్రభుత్వం పోతుందని తమ పార్టీ అధికారంలోకి వస్తుందని పవన్ అన్నారు. తక్కువ ఓట్లు తేడాతో ఒడిపోయాం అనే మాట వొద్దు కనీసం 25వేల ఓట్లతో గెలిచి నిరూపించాలని ఆయన అన్నారు.


ఇక తాను పరిహారం ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. తాను ఇచ్చే పరిహారంతో మత్స్యకారుల కష్టం తీరదని, అయితే ప్రభుత్వాన్ని కదిలించేందుకే పరిహారం ఇచ్చానని అన్నారు. హార్బర్లో ప్రమాదానికి చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయి అనే సమాచారం ఉందని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో కనీసం లైట్లు వేయలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయని వైసీపీ నేతలను నిలదీయాలని పవన్ పిలుపునిచ్చారు. ఎప్పుడు వైజాగ్ వద్దామన్నా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని, పాలన మీద నమ్మకం ఉంటే ఎందుకు జనసేనను చూసి భయపడుతున్నారని పవన్ ప్రశ్నించారు.