జనసేన ఎమ్మెల్యేకు అస్వస్థత.. క్షీణించిన ఆరోగ్యం.. హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అస్వస్థతకు గురయ్యారు

Janasena MLA Bommidi Nayakar
Janasena MLA Bommidi Nayakar: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు అనంతరం నాయకర్ కు టైపాయిడ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతిలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఈనెల 2న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మచిలీపట్నం దగ్గర కారు వెళ్తుండగా బైక్ అడ్డు రావటంతో తప్పించే ప్రయత్నంలో కారు ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఉన్నారు. ఆయన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.