ఏపీలో త్వరలోనే ప్రజాస్వామ్యపాలన వస్తుంది, సత్కారాలు తిరిగి ఇచ్చేస్తా.. అధికారులు, పోలీసులకు టీడీపీ నేత వార్నింగ్

jc diwakar reddy : కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ సీన్‌లోకొచ్చారు. వచ్చి రావడంతోనే ఫైర్ అయ్యారు. ఈటెల్లాంటి మాటలు ఎవరికి తాకాలో వారికి తాకేలా డైలాగ్‌లు వదిలారు. ఇంతకీ జేసీ కోపం వెనుక రీజనేంటి..?
తన మైన్స్ లోకి అధికారులు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు:
జేసీ దివాకర్ రెడ్డి.. పవర్‌లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సీతయ్యే… ఎవరి మాటా వినరు.. ఎవ్వర్నీ లెక్కచేయరు.. సీమ యాసలో తనదైన స్టయిల్‌లో మరోసారి తన వాయిస్ పెంచారు. తాడిపత్రిలో జేసీ మైన్స్ లోకి నిన్నమొన్నటి దాకా అధికారులెవరూ వెళ్లలేదు.
కానీ ఈ మధ్య జీపుల్లో వెళ్లి తనిఖీ చేశారట. ఇది జీర్ణించుకోలేకపోయారు జేసీ. డైరెక్ట్‌గా గనులు, భూగర్భ శాఖ కార్యాలయానికి వెళ్లి తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఎండీ లేకపోవడంతో.. అక్కడే కాసేపు కూర్చుని తనదైన స్టయిల్‌లో డైలాగ్‌లు పేల్చారు. బానిస బతుకులు అని వేదాంతం పలుకుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
సత్కారాలు తిరిగి ఇచ్చేస్తానంటూ వార్నింగ్:
సత్కారాలు చేయడానికి ప్రయత్నం చేయొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు జేసీ దివాకర్ రెడ్డి. ఒకవేళ చేసినా అంతకుమించి తిరిగి ఇచ్చేస్తానంటూ తనదైన మార్క్ డైలాగ్ వదిలారు. పనిలో పనిగా హిట్లర్, ముస్సోలిని కూడా సీన్‌లోకి లాగారు జేసీ.
మా జీవనాధారం గనులే.. మా కడుపు కొట్టకండి:
తమ్ముడి వంతు అయిపోయింది.. ఇక నేను దొరికానా అన్నది జేసీ పాయింట్. ప్రస్తుతానికి మ్యాటర్ ఏం లేకపోయినా.. ముందు ముందు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నిప్పులేనిదే పొగరాదంటారు. మరి జేసీ ఇన్ని డైలాగ్‌లు వదలడం వెనుక ఏం ఉందన్నది వేచి చూడాల్సిందే.