Lokesh Yuvgalam Padayatra : హ్యాట్సాఫ్ లోకేష్ .. నువ్వు గొప్ప నాయకుడవు అవుతావు : జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు..ఎన్నో బాధలు పడుతున్నాడు.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. అయినా పాదయాత్ర ఆపకు. ఇప్పటికే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రోత్సహించారు.

Lokesh Yuvgalam Padayatra : హ్యాట్సాఫ్ లోకేష్ .. నువ్వు గొప్ప నాయకుడవు అవుతావు : జేసీ ప్రభాకర్ రెడ్డి

Lokesh Padayatra..JC Prabhakar Reddy

Updated On : April 14, 2023 / 11:13 AM IST

Lokesh Yuvgalam Padayatra : యువగళం పేరుతో ప్రారంభించిన లోకేశ్ పాదయాత్ర అనంతపురంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లోకేశ్ పాదయాత్రలో పాల్గొనటం డ్యాన్స్ చేయటం వంటివి వైరల్ గా మారాయి. లోకేశ్ పాదయాత్రపై జేసీ ఆనందం వ్యక్తంచేశారు. లోకేశ్ గొప్ప నాయకుడు అవుతాడు అంటూ ఆశ్వీర్వదించారు. లోకేశ్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న లోకేశ్ గొప్ప నాయకుడు అవుతాడు అని అన్నారు. అంతేకాదు హ్యాట్సాఫ్ లోకేశ్ అంటూ ప్రశంసించారు. లోకేష్ పాదయాత్ర గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. లోకేష్ నడుస్తుంటే.. నాకు కన్నీరు వచ్చింది అని చెప్పుకొచ్చారు.

లోకేశ్ పాదయాత్ర గురించి జేసీ మాటల్లోనే..ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నావు. ఎన్నో బాధలు పడుతున్నావు.. అయినా పాదయాత్ర ఆపకు. ఇప్పటికే నీ పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది .నా కుమారుడు మూడు రోజులు నడిచి నానా ఇబ్బందులు పడ్డాడు. నువ్వు అలా కాదు..గాయాలు అయినా నువ్వు పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నావు..దారిలో ఎంతోమంది కష్టాలు తెలుసుకుంటున్నావు.వారికి మేమున్నామని భరోసా ఇస్తున్నావు. నీ పాదయాత్రకు ఎంతోమంది బ్రహ్మరథం పడుతున్నారు.చంద్రబాబు దంపతులు మీ కుమారున్ని రాష్ట్రం కోసం త్యాగం చేశారు. చంద్రబాబు ప్రజల మనిషి కాదు.. ఆయన చేసిన పనులు ప్రజలకు దగ్గర చేసింది.కానీ లోకేష్ ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వస్తున్నాడు. జగన్ చేస్తున్న తప్పులు, చంద్రబాబు ఫేస్ వ్యాల్యూతోనే ఈసారి గెలుస్తాం.ఎన్టీఆర్ ను చూసినట్టుగా జనం లోకేష్ ను చూస్తారు. అని దీవించారు.

కాగా ..లోకేశ్ పాదయాత్ర అనంతపురంలో కొనసాగుతున్న క్రమంలో ఈ పాదయాత్రలో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభిమానులు లోకేశ్ తో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెంచారు. డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. తనతో పాటు పక్క వాళ్లతో కూడా స్టెప్పులు వేయిస్తూ హుషారెక్కించారు.