KA Paul: నేను గతంలోనే చెప్పాను.. ఇప్పుడు మోదీ, షా ఒక్క ఫోన్ చేస్తే ఆయన బయటకు రారా?: కేఏ పాల్

ఏపీని సర్వనాశనం చేసిన బీజేపీకి ఓటేయాలని చెబుతున్న పవన్ కల్యాణ్ తీరును ప్రజలు అంగీకరించబోరని అన్నారు.

KA Paul: నేను గతంలోనే చెప్పాను.. ఇప్పుడు మోదీ, షా ఒక్క ఫోన్ చేస్తే ఆయన బయటకు రారా?: కేఏ పాల్

KA Paul

KA Paul – Chandrababu Arrest: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathyasai District) పుట్టపర్తిలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎటువంటి సత్సంబంధాలు లేవని తాను గతంలోనే చెప్పానని అన్నారు.

ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారని కేఏ పాల్ గుర్తు చేశారు. ఇప్పుడు మోదీ లేదా అమిత్ షా ఒక ఫోన్ చేస్తే చంద్రబాబు బయటకు రారా అని ప్రశ్నించారు. ఏపీని సర్వనాశనం చేసిన బీజేపీకి ఓటేయాలని చెబుతున్న పవన్ కల్యాణ్ తీరును ప్రజలు అంగీకరించబోరని అన్నారు. పవన్ పార్టీ నుంచి ఇందుకే తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణలాంటి వారు బయటకు వచ్చారని అన్నారు.

ఏపీకి ఎవరూ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతున్నారని కేఏ పాల్ చెప్పారు. తన పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీలోని అప్పులు తీరుతాయని అన్నారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. నిరుద్యోగం పెరిగిందని, రాష్ట్రంలోని రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి ఏ మాత్రమూ బాగోలేదని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఏపీని అద్భుతంగా మార్చుతానని అన్నారు.

Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన సీఎం భార్య