Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు పాల సరఫరా నిలిపేసిన కేఎంఎఫ్.. కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రూ.130 కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ అంగన్‌వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక పాల సరఫరా దారుల సమాఖ్య సోమవారం స్పష్టం చేసింది.

Andhra Pradesh
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రూ.130 కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ అంగన్‌వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక పాల సరఫరా దారుల సమాఖ్య సోమవారం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీల భారం పెరిగిందని.. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు సరఫరా చేసిన ధరకు ఇకపై పాలను ఇవ్వలేమని.. భారం తగ్గించుకునేందుకు లీటర్‌కు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లేఖ రాసింది.
చదవండి : Andhra Pradesh : వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు.. సీఎం జగన్ చేతుల మీదుగా ప్రదానం
రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు పాలు అందించేందుకు గతేడాది జూన్‌లో ఏపీ ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ఏపీ ప్రభుత్వం నందిని బ్రాండ్‌తో కేఎంఎఫ్ నుంచి ప్రతి నెలా 110 లక్షల లీటర్ల అల్ట్రా హై టెంపరేచర్ పాలను కొనుగోలు చేస్తోంది. అయితే గత నాలుగు నెలలుగా చెప్పింపు లేకపోవడంతో బకాయి రూ.130 కోట్లకు చేరింది. బకాయి విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కేఎంఎఫ్ పలు మార్లు లేఖలు రాసింది. అయితే దానిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
చదవండి : Andhra Pradesh : జీతాలు ఆలస్యం కాకుండా చూస్తాం, ఈనెలాఖరులోగా పీఆర్సీ