Mahanadu: మహానాడులో నేడు చర్చించనున్న అంశాలు ఇవే… సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
ప్రమాణ స్వీకారం ఉంటుంది.

Mahanadu
కడప వేదికగా నేడు రెండో రోజు తెలుగుదేశం మహానాడు జరగనుంది. ఇవాల ఉదయం 10 గంటలకు మహానాడు ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించనున్నారు.
తెలుగుజాతి-విశ్వఖ్యాతి, రాష్ట్రం-విధ్వంసం వైపు నుంచి పున్నర్మాణం వైపు అడుగులు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, యోగాంధ్ర ప్రదేశ్, మౌలిక సదుపాయలతో మారునున్న రాష్ట్ర ముఖచిత్రం తదితర తీర్మానాలపై చర్చిస్తారు.
Also Read: అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, ప్రజల సంరక్షణ- శాంతి భద్రతల పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి పటిష్ఠ చర్యలు రాజకీయ తీర్మానం తదితర అంశాలపై చర్చకు ఆమోదం తెలుపుతారు. సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుంది.