ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఫైర్

మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపట్ల బ్రదర్ అనిల్ కుమార్ స్పందించాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేశారు.

ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఫైర్

kodali nani

YCP MLA Kodali Nani : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభకు 600 కోట్లు ఖర్చుచేశారన్న షర్మిల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి షర్మిల అకౌంట్స్ చూస్తున్నారా? సిద్ధం సభకు 600 కోట్లు షర్మిల ఏమైనా అకౌంట్లో వేశారా అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ డిస్పోజల్ పార్టీ. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 5000 పింఛన్ ఇవ్వకుండా ఆంధ్రాలో ఇస్తానంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అసలు.. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్కశాతం కూడా ఓటింగ్ లేదని కొడాలి నాని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని షర్మిల ప్రయత్నమని, ఆమె ప్రయత్నం ఫలించదన్నారు.

Also Read : AP Politics : ఎన్నికల ఎత్తుగడలతో మరింత వేడెక్కిన ఏపీ రాజకీయం

రాహుల్ గాంధీ ఎంపీగా కూడా గెలవలేడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై బ్రదర్ అనిల్ కుమార్ స్పందించాలని డిమాండ్ చేశారు. ముస్లిం వ్యతిరేక పార్టీ బీజేపీ అన్న చంద్రబాబు సిగ్గులేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంకోసం ఎన్నిమోసాలయినా చేస్తాడు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడంటూ నాని విమర్శించారు.