Kodi Kathi Case : కోడికత్తి కేసు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, బెయిల్ విచారణ వాయిదా
మెమో రూపంలో అన్ని అంశాలను కోర్టు ఎదుట ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.

Kodi Kathi Case
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెమో రూపంలో అన్ని అంశాలను కోర్టు ఎదుట ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. ఈ ఘటన ఏపీలో సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేశాడు. ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ.. ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేసింది.
Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!
2018లో విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జగన్ పై శ్రీనివాస్ దాడి చేశాడు. అప్పట్లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సీబీఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండేది. దాంతో మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.
జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో అక్కడి క్యాంటీన్‌లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు.
Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు