Partha Sarathy: కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచుతుందని వైసీపీ తప్పుడు ప్రచారం: మంత్రి పార్థసారథి
దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ నేతల పరిస్థితి ఉందని చెప్పారు.

Parthasarathy
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అవినీతి, కక్ష సాధింపు చర్యల వల్ల ఇప్పుడు విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మంత్రి పార్థసారథి అన్నారు. అమరావతిలో పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన ప్రతిపాదనల వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయని చెప్పారు.
కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచుతుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని పార్థసారథి తెలిపారు. జగన్ హయాంలో విద్యుత్ సంస్థలు పూర్తిగా నష్టపోయాయని అన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ నేతల పరిస్థితి ఉందని చెప్పారు. 49 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక మెగావాట్ అదనపు విద్యుత్తు ఉత్పత్తి చేయలేదని అన్నారు.
కూకట్ పల్లిలో 10 ఎకరాల భూమి కొట్టేసి హిందూజాకి రూ.1,400 కోట్లు సమర్పించారని పార్థసారథి చెప్పారు. జగన్ హయాంలో పోలవరం విద్యుత్ ప్రాజెక్టును ధ్వంసం చేశారని తెలిపారు. దీనివలన నాలుగున్నర వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ఆనాటి పీపీఏలు కంటిన్యూ అయి ఉంటే నేడు ప్రజలపై భారంపడేది కాదని అన్నారు.
రాజకీయ వైరం ఉన్నా.. చంద్రబాబు ఆ విషయంలో హూందాగా వ్యవహరించారు : పేర్ని నాని