Konathala Ramakrishna: పవన్‌ కల్యాణ్‌తో సమావేశం కానున్న కొణతాల రామకృష్ణ.. ఆ సీటు నుంచి పోటీ?

ఇప్పుడు ఈ విషయంపైనే కొణతాల రామకృష్ణ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Konathala Ramakrishna: పవన్‌ కల్యాణ్‌తో సమావేశం కానున్న కొణతాల రామకృష్ణ.. ఆ సీటు నుంచి పోటీ?

Konathala Ramakrishna

Updated On : January 12, 2024 / 1:31 PM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సమావేశం కానున్నారు. ఏపీలోని అనకాపల్లిలో తన మద్దతుదారులు, అనుచరులతో కొణతాల సమావేశం ఏర్పాటు చేసి తన తదుపరి కార్యాచరణపై చర్చించారు. కొణతాల అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారు.

కొణతాల 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఆయన అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థిపై స్వల్ప ఆధిక్యతతో గెలిచారు. మళ్లీ 1991లో అదే స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అలాగే, అప్పట్లో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

అనంతరం 1996లో ఎంపీగా, 1999లో అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. 2004లో అనకాపల్లి శాసనసభ సభ్యుడిగా గెలిచారు. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పెట్టాక ఆయనకు అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక వైసీపీ నుంచి ఆయన దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. కొణతాల జనసేనలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంపైనే ఆయన తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అందుకే నాకు సీటును నిరాకరించారేమో: పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి