అందుకే నాకు సీటును నిరాకరించారేమో: పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి
‘చాలాకాలంగా నాలో అసంతృప్తి ఉంది. ఉన్న అసంతృప్తిని నియోజకవర్గ ప్రజల దగ్గర వ్యక్తం చేయటం నా బాధ్యత. నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.

Parthasarathy
Parthasarathy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మంత్రి జోగి రమేశ్‌కు వైసీపీ అధిష్ఠానం పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన పేరును సీఎం జగన్ ఫైనల్ చేశారు. అలాగే పెడన నుంచి ఉప్పల హారికను బరిలోకి దింపనున్నారు. దీనిపై మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు.
అమరావతిలో 10 టీవీతో పార్థసారథి మాట్లాడుతూ… ‘నేను దౌర్జన్యాలు చేయలేదు, బెదిరింపులు చేయలేదు అందుకే నాకు సీటును నిరాకరించారేమో. అధిష్ఠానం ఎందుకు సీటు నిరాకరించిందో నాకు తెలియదు. ముఖ్యమంత్రి దగ్గరికి ఒకసారి వెళ్లి వచ్చాను.
అనేక విషయాలు మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల మీదే నేను ఆధారపడి ఉన్నాను. నా భవిష్యత్ కార్యాచరణను పెనమలూరు నియోజకవర్గ ప్రజలే తేలుస్తారు. తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై మరోసారి మాట్లాడతా.
ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసేది త్వరలోనే చెబుతా? చాలాకాలంగా నాలో అసంతృప్తి ఉంది. ఉన్న అసంతృప్తిని నియోజకవర్గ ప్రజల దగ్గర వ్యక్తం చేయటం నా బాధ్యత. నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.
Balineni Srinivasa Reddy: బాలినేని రాజకీయ ప్రయాణంలో ఎన్నో డిఫరెంట్ షేడ్స్