Kottu Satyanarayana: అందుకే చంద్రబాబుకు ఏదైనా జరిగితే భువనేశ్వరి, లోకేశ్‌దే బాధ్యత: ఏపీ మంత్రి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలోని సీన్ ఇప్పుడు నిజజీవితంలో జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు.

Kottu Satyanarayana
Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే దానికి ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌దే బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉండొచ్చని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో ఇలాగే జరిగిందని, ఇప్పుడు నిజజీవితంలో జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులే కుట్రపూరితంగా అంతమొందిస్తారన్న అనుమానాలు తనకు ఉన్నాయని అన్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను భువనేశ్వరి భర్త చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని చెప్పారు. తండ్రి మరణంపై భువనేశ్వరి కనీసం స్పందించలేదని అన్నారు. కాగా, చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ ములాఖత్ లో ఆయనను నారా భువనేశ్వరి, లోకేశ్ కలిశారు.
Governor Tamilisai : ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశం