Kurnool Honor Killing Case : కులాంతర వివాహమే కారణమా? ఆమోస్‌ను చంపింది ఎవరు? కర్నూలు పరువు హత్య కేసులో దర్యాఫ్తు ముమ్మరం

సంచలనం రేపిన కర్నూలు పరువు హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. షరీన్ నగర్ లో ఆమోస్ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Kurnool Honor Killing Case : కులాంతర వివాహమే కారణమా? ఆమోస్‌ను చంపింది ఎవరు? కర్నూలు పరువు హత్య కేసులో దర్యాఫ్తు ముమ్మరం

Updated On : December 25, 2022 / 3:47 PM IST

Kurnool Honor Killing Case : సంచలనం రేపిన కర్నూలు పరువు హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. కర్నూలు నగరంలోని షరీన్ నగర్ లో ఆమోస్ అనే యువకుడి హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఆమోస్ హత్యకు ప్రేమ పెళ్లే(కులాంతర వివాహం) కారణం అంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమోస్ ను ప్రేమించి అమ్మాయి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆమోస్ ను ఇష్టపడి అమ్మాయి తమ ఇంటికి వస్తే చంపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమోస్ అదృశ్యం అయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత ఆమోస్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆమోస్ ను.. దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం.

Also Read..Tunisha Sharma Last Video : ఆత్మహత్యకు ముందు.. యువ నటి వీడియో వైరల్, ఈ షాట్ తర్వాతే సూసైడ్..!

కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం అల్వాల్ కు చెందిన ఆమోస్.. అదే గ్రామానికి చెందిన అరుణ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి విషయం గురించి ఇరువురూ వారి కుటుంబసభ్యులకు చెప్పారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆరేళ్ల క్రితం ఆమోస్, అరుణ వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తింటి వారితో ఆమోస్ కు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యువతి కుటుంబసభ్యులే తమ కుమారుడిని చంపేశారని ఆమోస్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమోస్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read..Tunisha Sharma Suicide : ప్రముఖ యువ నటి ఆత్మహత్య.. మేకప్ రూమ్‌లోనే ఉరి వేసుకుంది

కులాంతర ప్రేమ వివాహమే ఆమోస్ హత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమోస్ ను హత్య చేసిన దుండగులు అర్థరాత్రి వేళ పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలబెట్టారు. ఆమోస్ హంతకులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య ఎలాంటి కక్షలు లేవన్నారు ఆమోస్ కుటుంబసభ్యులు. కేవలం కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతోనే అమ్మాయి బంధువులు.. ఆమోస్ ను చంపేశారని అంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కర్నూలులో రెండు రోజుల క్రితం ఆమోస్ అనే యువకుడు అదృశ్యం అయ్యాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతుండగానే.. అతడి డెడ్ బాడీ కనిపించింది. ఆమోస్ ను హత్య చేసిన దుండగులు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమోస్ ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అత్తింటి వారితో ఆమోస్ కు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు ఈ మర్డర్ కేసుని పరువు హత్య కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు.