Khushbu : మంత్రి రోజాకు బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. చెప్పే వరకు పోరాడతా : ఖుష్బూ

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై మాజీ మంత్రి,టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన  వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Khushbu : మంత్రి రోజాకు బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. చెప్పే వరకు పోరాడతా : ఖుష్బూ

Kushboo, Bandaru Satyanarayana

Updated On : October 6, 2023 / 1:18 PM IST

Khushbu Bandaru: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై మాజీ మంత్రి,టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఖుష్బూ సీరియస్ అయ్యారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండింస్తున్నానని అన్నారు. బండారు ఓ రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా విఫలమయ్యారంటూ ఫైర్ అయ్యారు. ఇది తాను రోజాకు ఓ స్నేహితురాలిగా కాదు సాటి మహిళగా మద్దతునిస్తున్నానని.. బండారు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. బంగారు సత్యానారాయణ రోజాకు క్షమాపణలు చెప్పే వరకు తాను పోరాడతానని స్పష్టం చేశారు.

నారీ శక్తి వంటి చట్టాలను తెచ్చుకుంటున్నాం.. అయినా ఇంకా మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దారుణమన్నారు. నీచాతి నీచంగా మాట్లాడటం వారి మానసిక దౌర్భల్యానికి నిదర్శనం అంటూ ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ చట్టాలు మహిళల సాధికారత ఉపయోగపడతాయి. కానీ ఇటువంటి సమయంలో కూడా మహిళల గురించి కుసంస్కారం.. మానసిక దుర్భలత్వంతో మాట్లాడటం మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు బండారు సత్యనారాయణమూర్తి వంటి వ్యక్తులు అంటూ ఖుష్బూ నిప్పులు చెరిగారు.

Also Read: మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ ఒక స్త్రీ విజయం వెనుక..

మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు భద్రతకు, దిగజారుడు తనానికి నిదర్శన అంటూ దుయ్యబట్టారు. మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రధాని మోదీ తెచ్చారు.. ఇలాంటి తరుణంలో బండారు లాంటి వాళ్ళు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశంలో మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో మహిళపై ఇంత అసభ్యకరంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. మహిళలని గౌరవించే వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరని అన్నారు. బండారు సత్యనారాయణ మూర్తి తన రాష్ట్ర, తన నియోజకవర్గ మహిళలను అవమానించినట్లే అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బండారు క్షమాపణ చెప్పేంత వరకు రోజాతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. బండారు లాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించడం ప్రజల దురదృష్టం అంటూ ఎద్దేవా చేశారు.