Lakshmi : కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉంది, జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానని నమ్మకం లేదు- లక్ష్మి

నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే ఒక్క రోజులో బెయిల్ లభించింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం వెనక చాలామంది పాత్ర ఉంది.

Lakshmi : కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉంది, జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానని నమ్మకం లేదు- లక్ష్మి

Updated On : February 13, 2025 / 12:57 AM IST

Lakshmi : తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మికి జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం లక్ష్మిని తిరుపతిలో అరెస్ట్ చేశారు రాజస్థాన్ పోలీసులు. జైపూర్ సీజేఎం కోర్టు లక్ష్మికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ రావడంతో పోలీసులు ఆమెను విడుదల చేశారు. ఆ వెంటనే రాజస్థాన్ నుంచి మరో సెల్ఫీ వీడియోని లక్ష్మీ విడుదల చేసింది.

‘నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే ఒక్క రోజులో బెయిల్ లభించింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం వెనక చాలామంది పాత్ర ఉంది. ఆధారాలతో సహా త్వరలో అవన్నీ బయటపెడతా. నాకు కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉంది. జైపూర్ నుంచి తిరుపతికి క్షేమంగా వస్తానని నమ్మకం లేదు’ అని లక్ష్మి వాపోయింది.

‘నేను తిరుపతిలో కిరణ్‌ రాయల్‌పై ఫిర్యాదు చేశా. ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉన్న వాళ్లకే పోలీసులు అండగా ఉంటారా? డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను అభ్యర్థించినా నాకు న్యాయం జరగలేదు. మరో వ్యక్తి కూడా ఉన్నాడు. నేను తిరుపతికి వచ్చిన వెంటనే ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తాను’’ అని లక్ష్మి తెలిపారు. కిరణ్‌ రాయల్‌ పై లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.

Also Read : జగన్ 2.O మామూలుగా ఉండదు..! మరోసారి వైసీపీ చీఫ్ హాట్ కామెంట్స్..

కిరణ్ రాయల్ తనను నమ్మించి మోసం చేశారని లక్ష్మి ఆరోపించారు. రూ.1.20 కోట్లు తీసుకున్నారని చెప్పారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని, డబ్బు గురించి అడిగితే పిల్లలను నా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేశారామె. కిరణ్ రాయల్ పై మహిళ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.

మరోవైపు ఆ మహిళతో కిరణ్ రాయల్ ప్రైవేట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపనలు చేసిన లక్ష్మిని.. రెండు రోజుల క్రితం జైపూర్ పోలీసులు ఏపీకి వచ్చి మరీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నారని, తాజాగా వీడియోలు బయటకు రావడంతో గుర్తించి అరెస్ట్ చేశామని జైపూర్ పోలీసులు తెలిపారు.