Ys Jagan Mohan Reddy : జగన్ 2.O మామూలుగా ఉండదు..! మరోసారి వైసీపీ చీఫ్ హాట్ కామెంట్స్..
ఒకవైపు సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మ్యానిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది.

Ys Jagan Mohan Reddy : టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవని మాజీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని, సూపర్ సిక్స్ ను గాలికి వదిలేశారని ఆరోపించారు. జగన్ 2.Oలో ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటామని తెలిపారు. గుంటూరులో కార్యకర్తలతో సమావేశమైన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : రాజకీయాల్లోకి రీఎంట్రీపై.. చిరంజీవి సంచలన ప్రకటన
”ఎన్నికలు అయిపోయాయి. అప్పుడే 9 నెలలు గడిచిపోయాయి. 2019 నుంచి 2024 వరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ 1, పరిపాలనలో ఉన్నప్పుడు చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితుల నుంచి ఇది సాధ్యం అవుతుందని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే జరిగింది.
ఒకవైపు సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మ్యానిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్.. అన్నీ కూడా తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు. ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది. వైసీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే” అని జగన్ అన్నారు.