Sidharth Luthra : రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిద్ధార్ధ లూథ్రా, చంద్రబాబుతో ములాఖత్

ఏసీబీ కోర్టులో అసలేం జరుగుతోంది? ఏ విధంగా వెళితే మనకు న్యాయం జరుగుతుంది? Sidharth Luthra - Chandrababu Arrest

Sidharth Luthra : రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిద్ధార్ధ లూథ్రా, చంద్రబాబుతో ములాఖత్

Sidharth Luthra - Chandrababu Arrest

Updated On : September 13, 2023 / 8:52 PM IST

Sidharth Luthra – Chandrababu Arrest : రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా భేటీ అయ్యారు. లోకేశ్ క్యాంప్ కార్యాలయం నుంచి కారులో రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుని రిసెప్షన్ లో వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత జైలు లోపలికి వెళ్లారు లూథ్రా. చంద్రబాబుతో న్యాయపరమైన అంశాలపై లూథ్రా చర్చించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున కేసు వాదిస్తున్నారు సిద్ధార్ధ లూథ్రా.

కాగా, ఇవాళ సిద్ధార్ధ లూథ్రా చేసిన ట్వీట్ అత్యంత కీలకంగా మారింది. ”అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ మనకు న్యాయం కనుచూపు మేరలో లేకున్నప్పుడు కత్తి తీసుకుని పోరాటం చేయడమే సరైనదని అంటూ ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

Also Read..Chandrababu: చంద్రబాబుకు ఇండియా కూటమి ఆపన్న హస్తం.. సేఫ్ గేమ్ ఆడేందుకే సీబీఎన్ మొగ్గు!

చంద్రబాబు అరెస్ట్ మొదలు ఇప్పటివరకు ఈ కేసుని పూర్తిగా స్టడీ చేస్తూ ఇన్వాల్ అయ్యి ఉన్నారు లూథ్రా. నాలుగు రోజులుగా ఏసీబీ కోర్టులో పిటిషన్ల వేస్తూ ఫైట్ చేస్తున్నారు. ఇవాళ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ వేశారు.

రోడ్డు మార్గంలో విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లిన లూథ్రా.. నారా లోకేశ్ ను కలిశారు. ఆ తర్వాత చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అనేదానిపై ఆయన చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం. ఏసీబీ కోర్టులో అసలేం జరుగుతోంది? ఏ విధంగా వెళితే మనకు న్యాయం జరుగుతుంది? అనే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే చంద్రబాబు సూచనలు కూడా లూథ్రా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read..Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్