AP Liquor Sales : ఏపీలో మద్యం అమ్మకాల వేళలు కుదింపు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల వేళలను కుదించారు. రాష్ట్రంలో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది.

Ap Liquor Sales
Liquor sales hours reduced : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల వేళలను కుదించారు. రాష్ట్రంలో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ఫ్యూ నేపథ్యంలో ఇప్పటికే ప్రజా రవాణాపై సైతం ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు స్పష్టం చేసింది.
నిత్యావసరాల దుకాణాలకు సైతం ఇదే సమయం వర్తిస్తుందని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ప్రైవేట్ వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. సిటీ బస్సులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.