ఏపీలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన వడ్డీ వ్యాపారి కుటుంబం

కూలీ పనులు చేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ శిరీష అప్పులు తీరుస్తోంది.

ఏపీలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన వడ్డీ వ్యాపారి కుటుంబం

Crime

Updated On : June 17, 2025 / 9:31 AM IST

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళను రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి హింసించారు. భర్త తిమ్మరాయప్ప తీసుకున్న 80 వేల రూపాయల అప్పును తిరిగి చెల్లించలేదని అతడి భార్య శిరీషను రోడ్డు పక్కన చెట్టుకు కట్టేశాడు ముని కన్నప్ప అనే వ్యక్తి.

గ్రామస్తుల సహకారంతో కట్లు విప్పుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శిరీష ఫిర్యాదు చేసింది. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముని కన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం తిమ్మరాయప్ప 80 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు.

Also Read: తారస్థాయికి యుద్ధం.. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ను హతమార్చాల్సిందేనంటూ నెతన్యాహు కామెంట్స్‌.. “జీ7” నుంచి బయలుదేరనున్న ట్రంప్

అప్పు తీర్చలేక భార్య శిరీష (25), ఇద్దరు బిడ్డలను వదలి పారిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ శిరీష అప్పులు తీరుస్తోంది. అయినప్పటికీ సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై శిరీషను తిమ్మరాయప్ప, అతని కుటుంబీకులు అడ్డగించారు.

శిరీషను తిమ్మరాయప్ప, అతని భార్య, కొడుకు, కోడలు రోడ్డుపై నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న వేపమానుకు తాళ్లతో కట్టేశారు. ముని కన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.