‘Avatar 2’ in Andhra Pradesh: అవతార్-2 సినిమా చూస్తూ పెద్దాపురంలో ఒకరి మృతి

‘Avatar 2’ in Andhra Pradesh: అవతార్-2 సినిమా చూస్తూ పెద్దాపురంలో ఒకరి మృతి

Avatar 2 Full Movie Leaked Online For Free Download

Updated On : December 17, 2022 / 1:50 PM IST

‘Avatar 2’ in Andhra Pradesh: ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ‘అవతార్-2’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. అవతార్ సినిమా చూస్తుండగా అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అతడి తమ్ముడు రాజు పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అయితే, అప్పటికే లక్ష్మిరెడ్డి శ్రీను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అవతార్ మొదటి భాగం సినిమా 2009 డిసెంబరులో విడుదలైన విషయం తెలిసిందే. అప్పట్లో తైవాన్ లోనూ 42 ఏళ్ల ఓ వ్యక్తి ఆ సినిమాను చూస్తూ థియేటర్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడికి రక్తపోటు ఉందని అనంతరం తేలింది. అతడు సినిమా చూస్తూ బాగా ఉద్వేగానికి గురికావడంతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

ఇప్పుడు పెద్దాపురంలో చోటుచేసుకున్న ఘటన కూడా అటువంటిదే అయి ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణంగా హారర్ సినిమాలు చూస్తున్న సమయంలో కొందరు గుండెపోటుకు గురవుతారు. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్-2’ సినిమాలో అటువంటి భయానక ఘటనలు ఏమీ ఉండకపోయినప్పటికీ, ఆ విజువల్స్ చూస్తుంటే కొందరు అమితానందానికి, ఉద్వేగానికి గురవుతుంటారు.

Swiggy Report: ఫుడ్ లవర్స్ ఆల్ టైం ఫేవరెట్ బిర్యానీయే.. ఒక్క సెకనులో రెండు బిర్యానీలు లాగించేస్తున్నారట!