Andhra Pradesh: భర్తను అతడి ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఇద్దరికీ అర గుండు కొట్టించి..
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమది పరిగి మండలం ఊటుకూరు గ్రామమని..

Andhra Pradesh - Sri Sathya Sai district
Andhra Pradesh – Sri Sathya Sai district: భర్త తీరుపై అనుమానం పెంచుకుంది ఓ భార్య. అతడు రహస్యంగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని ప్రణాళిక రచించుకుంది. భర్తను ఆమె ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంది.
భర్త, అతడి ప్రియురాలు ఒకే చోట ఉన్నారని పక్కా సమాచారం అందుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త, అతడి ప్రియురాలు ఇద్దరికీ అరగుండు గీయించింది. అనంతరం ఊరేగించింది. వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుంటే భర్త తప్పించుకు పారిపోయాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమది పరిగి మండలం ఊటుకూరు గ్రామమని, తన భర్త హిందూపురంలోని హస్నాబాద్ కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య ఆరోపించింది. ఈ కేసులో ఆ మహిళ హిందూపురం వన్ టౌన్ పోలీస్టేషన్ వెళ్లింది. అయితే, ఈ కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాదని పోలీసులు అంటున్నారు.
Pilibhit: తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని.. విషం తాగిన ఇద్దరు అమ్మాయిలు..