Manchu Manoj : చంద్రబాబుని కలిసిన మంచు మనోజ్ దంపతులు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మనోజ్
పెళ్లైన తర్వాత ఇప్పటివరకు చంద్రబాబుని కలవలేదని, అందుకే ఇవాళ వెళ్లి కలిశామని మంచు మనోజ్ వెల్లడించారు. Manchu manoj

Manchu Manoj - Chandrababu Naidu
Manchu Manoj – Chandrababu Naidu : మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మనోజ్, మౌనికలు.. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వివాహం జరిగిన తర్వాత తొలిసారిగా చంద్రబాబుని కలిశారు మనోజ్ దంపతులు.
తమ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లినట్లు మనోజ్ దంపతులు తెలిపారు. పెళ్లైన తర్వాత ఇప్పటివరకు చంద్రబాబుని కలవలేదని, అందుకే ఇవాళ వెళ్లి కలిశామని మంచు మనోజ్ వెల్లడించారు. అంతేకాదు పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read.. TDP : టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా, పార్టీకి వైరస్ పట్టుకుందని కంటతడి
చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” మీ అందరికీ తెలిసిందే. చంద్రబాబు మాకు ఫ్యామిలీ మెంబర్. ఆయనంటే మాకు ఎంతో ప్రేమాభిమానం. పెళ్లైన తర్వాత ఇప్పటివరకు కలిసింది లేదు. కలుద్దామని చాలా సందర్భాల్లో అనుకున్నా కుదరలేదు. చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ కి రావడం జరిగింది. ఫోన్ చేసి వచ్చి కలవమని చంద్రబాబు కబురు చేశారు. మా బాబుతో కలిసి వచ్చి చంద్రబాబుని కలిశాము. చంద్రబాబు బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. రేపు మా బాబు పుట్టిన రోజు. బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లిపోతున్నాం. పొలిటికల్ ఎంట్రీపై మంచి సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుంది” అని మంచు మనోజ్ అన్నారు.