Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజు దూడుకు.. కీలక ఆదేశాలు

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్ట్ లో పదేళ్లుగా ఆడిట్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజు దూడుకు.. కీలక ఆదేశాలు

Updated On : June 17, 2021 / 5:41 PM IST

ashok gajapathi raju : మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్ట్ లో పదేళ్లుగా ఆడిట్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిటింగ్ పై వివరణ కోరారు.

సంస్థ నుంచి చెల్లించిన ఆడిటింగ్ ఫీజుపై 21లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ట్రస్ట్ పరిధిలోని విద్యా సంస్థల బడ్జెట్ పై వారం రోజుల్లో ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 5లక్షలు పైబడిన కొనుగోళ్లపై వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మాన్సాస్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని అశోక్ గజపతి రాజు ఆదేశించారు.

Read:AP Govt: జగన్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం