పెళ్లి రద్దు కావడంతో వరుడు ఆత్మహత్య

పెళ్లి రద్దు కావడంతో వరుడు ఆత్మహత్య

Updated On : February 1, 2021 / 5:46 PM IST

marriage cancel takes youth life: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి రద్దు వార్త ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన శివ(28)కి బెంగళూరుకి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో వధువుని కలిసేందుకు శివ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైలులో బయలుదేరాడు.

కాగా, ఏం జరిగిందో కానీ, వధువు తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. వివాహం రద్దైయిందని తెలుసుకున్న శివ తీవ్ర మనస్తాపం చెందాడు. మార్గం మధ్యలో కర్నాటకలోని దొడ్డబల్లాపూర్ స్టేషన్ దగ్గర రైలు నుంచి దిగిపోయాడు. మనస్తాపానికి గురైన హరి అక్కడే పట్టాలపై వస్తున్న ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.