COVID 19 in Andhrapradesh : 478 కేసులు, ముగ్గురు మృతి

COVID 19 in Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 64 వేల 099 శాంపిల్స్ పరీక్షించగా..478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. విశాఖలో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 715 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తంగా..రాష్ట్రంలో 1,10,01,476 శాంపిల్స్ పరీక్షించారు.
జిల్లాల వారీగా : –
అనంతపురం : 30. చిత్తూరు 89. ఈస్ట్ గోదావరి : 58. గుంటూరు : 48. కడప : 19. కృష్ణా : 62. కర్నూలు : 06. నెల్లూరు : 17. ప్రకాశం : 12. శ్రీకాకుళం : 13. విశాఖపట్టణం : 44. విజయనగరం : 17. వెస్ట్ గోదావరి : 63. మొత్తం 478.
రాష్ట్రాల వారీగా శాంపిల్స్ : –
ఆంధ్రప్రదేశ్ : 1,10,01,476. కేరళ : 70 56,318. కర్నాటక : 1,25,09,743. తమిళనాడు : 1,30,86,807. తెలంగాణ : 62,05,688. గుజరాత్ : 87,80,266. మహారాష్ట్ర : 1,18,06,808. రాజస్థాన్ : 48,55,362. మధ్యప్రదేశ్ : 41,93,126. ఇండియా : 15,66,46,280.