Mekathoti Sucharita : నేరస్తులను వదిలేది లేదు-హోంమంత్రి సుచరిత

నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఏదైనా.. మహిళలు, బాలికలపై చేయి వేస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదని..

Mekathoti Sucharita : నేరస్తులను వదిలేది లేదు-హోంమంత్రి సుచరిత

Mekathoti Sucharitha

Updated On : January 31, 2022 / 11:09 PM IST

Mekathoti Sucharita : రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటనపై హోంమంత్రి సుచరిత స్పందించారు. నేరం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నేరాలు జరగడం లేదని తాము చెప్పడం లేదని… అయితే నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నేరస్తులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలన్నారు. పార్టీ ఏదైనా.. మహిళలు, బాలికలపై చేయి వేస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?

గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయవాడ బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ జైన్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మరోవైపు నారా లోకేశ్ పీఏ మహిళలను వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయని హోంమంత్రి చెప్పారు. ఎలాంటి వారినైనా విచారించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చామని తెలిపారు. దిశ యాప్ ను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

విజయవాడలో బాలికను లైంగికంగా వేధించిన ఆమె ఆత్మహత్యకు కారణమైన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజ సంఘాలు ఆందోళనకు దిగాయి. బాలిక ఇంటి దగ్గర ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. చిన్నారిని లైంగికంగా వేధించిన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన బాలికకు న్యాయం చేయాలన్నారు. మరోవైపు వినోద్ జైన్ కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వినోద్ జైన్ ఇంటిని కూడా పోలీసులు సీజ్ చేశారు. వినోద్ జైన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. బాలిక మృతి అనంతరం వినోద్ ఎవరితో మాట్లాడాడు అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బాలిక ఎవరికీ ఫిర్యాదు చేయకుండా చనిపోవడానికి బెదిరింపులే కారణమా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.