Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. భీకర గాలుల హెచ్చరికలు ..
Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిలాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Andhra Pradesh and Telangana Rain Alert
- బంగాళాఖాతంలో వాయుగుండం
- ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు
- వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భీకర గాలులుతోపాటు.. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read : Karur Stampede : సీఎం విజయ్‌కి ఫస్ట్ షాక్..! ఆ ఆర్డర్స్ చెల్లవన్న మద్రాస్ హైకోర్టు
తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం.. తెలంగాణలో వచ్చే మూడు నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
జులై 28న (మంగళవారం) అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా 29వ (బుధవారం) తేదీన అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (మంగళవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే.. రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
