Ambati Rambabu : టీడీపీ పోలవరం ప్రాజెక్టును సగంలో వదిలేసి పారిపోయింది : అంబటి రాంబాబు

కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.

Ambati Rambabu : టీడీపీ పోలవరం ప్రాజెక్టును సగంలో వదిలేసి పారిపోయింది : అంబటి రాంబాబు

Minister Ambati Rambabu

Updated On : July 15, 2023 / 11:39 AM IST

Minister Ambati Rambabu  polavam project. : పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా ఆలస్యం కావటానికి గత టీడీపీ ప్రభుత్వమే కారణం అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును సగంలోనే వదిలేసి గత ప్రభుత్వం పారిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం మా ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంతకంతకు ఆలస్యమవుతోంది. ఇప్పటికే తమ ప్రభుత్వ హయాంలో 70 శాతం పూర్తి చేశామని టీడీపీ అంటోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందనీ రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు నిలిపివేసిందంటూ ఆరోపించింది. కానీ వైసీపీ మాత్రం రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు ఆదా చేశామంటోంది. ఇలా అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలో పోలవరం ప్రాజెక్టు ప్రజలకు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.