Minister Bosta: వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నాడు.. ఈసారి టీడీపీ తుడిచిపెట్టుకొని పోవటం ఖాయం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొత్స సత్యనారాయణ 10టీవీతో మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విలవిల అంటే అయిపోతుందా.. ప్రజలకు తెలుసు కళ ఉన్న పార్టీ ఏదో అంటూ ఎద్దేవా చేశారు. మూడేళ్లు ఇంట్లో పడుకున్న చంద్రబాబు ఇప్పుడు అధికార పార్టీపై యుద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నాడని...

Minister Bosta: వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నాడు.. ఈసారి టీడీపీ తుడిచిపెట్టుకొని పోవటం ఖాయం

Botsa

Updated On : May 29, 2022 / 2:32 PM IST

Minister Bosta: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొత్స సత్యనారాయణ 10టీవీతో మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విలవిల అంటే అయిపోతుందా.. ప్రజలకు తెలుసు కళ ఉన్న పార్టీ ఏదో అంటూ ఎద్దేవా చేశారు. మూడేళ్లు ఇంట్లో పడుకున్న చంద్రబాబు ఇప్పుడు అధికార పార్టీపై యుద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నాడని, చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదని ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నాడని, నిన్న మహానాడుకు వచ్చిన వారంతా టీడీపీ కార్యకర్తలేనని, ప్రజలెవరూ రాలేదంటూ బొత్స వ్యాఖ్యానించారు. ధరలు పెరిగాయని చంద్రబాబు అంటున్నాడని, పెరగడానికి కారణం ఎవరో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ధరల విషయంలో కేంద్రాన్ని ఎందుకు అడగలేక పోతున్నాడో చంద్రబాబు చెప్పాలని బొత్స అన్నారు.

Chandrababu Warning : రేపు..నీ పేపర్‌, టీవీ, సిమెంట్‌కు నేనే పర్మిషన్ ఇవ్వాలి- చంద్రబాబు ఫైరింగ్ స్పీచ్

ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయనకు ఆయన ఊహించుకొని ప్రచారం చేస్తున్నాడని, మేము ముందస్తుకు వెళ్తున్నాం అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు అంటూ బొత్స నిలదీశారు. మాకు ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి అని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని, చంద్రబాబుకే ఆ అవసరముందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందని బొత్స జోస్యం చెప్పారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేంద్రం నుండి వచ్చిన నిధులు ఎన్ని? మా మూడేళ్ల పాలనలో నిధులు ఎంత వచ్చాయి అనే విషయాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల్లో సఫలీకృతం అవుతున్నామని బొత్స తెలిపారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదని, చంద్రబాబు, ఆయన బలగం వై.ఎస్. జగన్ ను ఎదుర్కోవటానికి సరిపోరని అన్నారు. ఆ విషయాన్ని చంద్రబాబే ఒప్పుకున్నాడని బొత్స ఎద్దేవా చేశారు.

Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స

ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ను ఓడించాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, కానీ ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని, మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు విశేషమైన ప్రజాధరణ లభిస్తుందని బొత్స తెలిపారు. చంద్రబాబు ఎవరితో కలిసి వస్తాడో రానివ్వండి.. మేము మాత్రం సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తామంటూ బొత్స అన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని, ఈసారి టీడీపీ కనుమరుగు కావటం ఖాయమని, ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని బొత్స అన్నారు.